Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ చెన్నకేశవుని సేవలో సోమిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ చెన్నకేశవుని సేవలో సోమిరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరు దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • అనంతరం ఆలయ నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరు దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *