Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ఒక జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ఒక జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్న కొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక జనసైనికుడిగా కొట్టే కుంటుంబ సభ్యుడిగా మాటల్లో చెప్పలేని…

జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్న కొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక జనసైనికుడిగా కొట్టే కుంటుంబ సభ్యుడిగా మాటల్లో చెప్పలేని సంతోషంగా వుంది.శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు,మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించడంతో ఇందుకు అనుగుణంగా NDA కూటమి ప్రభుత్వం శ్రీ కొట్టే సాయి ప్రసాద్ పేరును నిన్న ప్రకటించడంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.జనసేన పార్టీ బలోపేతం కోసం అంకిత బావంతో నిజాయితీగా తన కుంటుంబాని సైతం పక్కన పెట్టి పనిచేసిన జనసైనికుడు కొట్టే సాయి,కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన కొట్టే వారి ప్రచార రథలలో కొట్టే ఉదయ్ భాస్కర్,కొట్టే వెంకట్రావు,కొట్టే వెంకట నారయణ,కొట్టే సాయి ప్రసాద్ లది కీలక పాత్ర,అప్పటి CI అంజు యాదవ్ అకారణంగా దాడి చేసిన ప్రజాస్వామ్యయుతంగా,జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన మా అన్న శ్రీ కొట్టే సాయిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం ఇది నిజమైన జనసైనికుడు దక్కిన గౌరవంగా ప్రతి జనసైనికుడు బావిస్తున్నాడు.ఒక సామన్య కార్యకర్తకు అండగా వుండటంలో వాలకు తగిన బాధ్యతలు ఇవ్వడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరువాతే ఎవరైన అని మరోసారి నిరుపించారు అని జనసేన నాయకులు కొట్టే శ్రీహరి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *