Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీహరినగర్‌లో చెత్త కుప్పలు.. దుర్గంధంతో ప్రజల అవస్థలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీహరినగర్‌లో చెత్త కుప్పలు.. దుర్గంధంతో ప్రజల అవస్థలు!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: నగరంలోని శ్రీహరినగర్ చివర రైల్వే ట్రాక్ వీధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.
  • ఖాళీ స్థలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చెత్త, వ్యర్థాలను పడేస్తుండటంతో భారీగా కుప్పలు పేరుకుపోతున్నాయి.
  • వాటిని తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.

నెల్లూరు: నగరంలోని శ్రీహరినగర్ చివర రైల్వే ట్రాక్ వీధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఖాళీ స్థలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చెత్త, వ్యర్థాలను పడేస్తుండటంతో భారీగా కుప్పలు పేరుకుపోతున్నాయి. వాటిని తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వర్షాలకు చెత్త తడిసి పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ ప్రాంతంలో ఆసుపత్రులు అధికంగా ఉండటంతో నిత్యం రోగులు, వారి బంధువులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అపరిశుభ్రత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త కుప్పలను తొలగించి, భవిష్యత్తులో చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *