వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన 'విద్య-వసతి-వికాసం' కార్యక్రమానికి దాతల నుంచి స్పందన లభిస్తోంది.
- ఇందులో భాగంగా ఎస్ఎన్జీ గ్రూప్ ఛైర్మన్ జయమురుగన్ శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి రూ.10 లక్షల విరాళం చెక్కును అందజేశారు.
- ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
నెల్లూరు: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన ‘విద్య-వసతి-వికాసం’ కార్యక్రమానికి దాతల నుంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఎన్జీ గ్రూప్ ఛైర్మన్ జయమురుగన్ శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి రూ.10 లక్షల విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. విరాళాలు అందించదలచిన వారు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిని సంప్రదించాలని సూచించారు.