వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట మండలం దావాదిగుంట వద్ద శ్రీహరికోటకి వెళ్లే మార్గంలో ఉన్న గుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- మృతి చెందిన వ్యక్తి గత రెండు రోజులుగా గ్రామం పరిసర ప్రాంతాల్లోనే తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
సూళ్లూరుపేట మండలం దావాదిగుంట వద్ద శ్రీహరికోటకి వెళ్లే మార్గంలో ఉన్న గుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతి చెందిన వ్యక్తి గత రెండు రోజులుగా గ్రామం పరిసర ప్రాంతాల్లోనే తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే, సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు గుంటలో పడి ప్రాణాలు కోల్పోయాడా లేక దీని వెనుక మరేదైనా హత్యకోణం ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ఈ అనుమానాస్పద మరణాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నింపుతున్నాయి. ఈ వరుస ఘటనలపై పోలీసులు వెంటనే ప్రత్యేక దృష్టి సారించి, నిజానిజాలను తేల్చి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.