Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీసిటీలో బాయిలర్ పేలుడు: నలుగురు కార్మికుల మృతి పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీసిటీలో బాయిలర్ పేలుడు: నలుగురు కార్మికుల మృతి పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో జరిగిన వాటర్ బాయిలర్ పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. ప్రమాద స్థలంలో ఇద్దరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణ, సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు.

శ్రీసిటీలో బాయిలర్ పేలుడు: నలుగురు కార్మికుల మృతి పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *