Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మంత్రి పేరుతో వసూళ్ల ఆరోపణలు.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మంత్రి పేరుతో వసూళ్ల ఆరోపణలు.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పేరును ఉపయోగించి హోటళ్లు, టిఫిన్ సెంటర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఫుడ్, టిఫిన్ నాణ్యత బాగోలేదంటూ దౌర్జన్యానికి పాల్పడి, యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. తాము మంత్రికి సన్నిహితులమని, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కలిసి తమ సమస్యను వివరించినట్లు సమాచారం. స్పందించిన మంత్రి రామచంద్రపురం సీఐతో ఫోన్‌లో మాట్లాడి, ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టి, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *