Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో ‘పేక్స్ ఇండియా’ నీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీసిటీలో ‘పేక్స్ ఇండియా’ నీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీసిటీ, డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PETI) ఏర్పాటు చేసిన అత్యాధునిక NABL నీటి/మురుగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు.
  • శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా.
  • రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శ్రీసిటీ, డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి)

శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PETI) ఏర్పాటు చేసిన అత్యాధునిక NABL నీటి/మురుగునీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీసిటీని ‘క్లీన్ అండ్ గ్రీన్’ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేసే యత్నంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ల్యాబ్ పరిశ్రమలకు వేగవంతమైన, ఖచ్చితమైన మరియు విశ్వసనీయ టెస్టింగ్ సేవలను అందిస్తుందని చెప్పారు.

పేక్స్ ఇండియా ఎండీ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ సదుపాయం ‘మేక్ ఇన్ ఇండియా’ భావనకు అనుగుణంగా అత్యాధునిక యూరోపియన్ ప్రమాణాలతో పనిచేస్తుందని తెలిపారు. 30కి పైగా పరామితుల్లో నీటి, మురుగునీటి టెస్టింగ్ అందుబాటులో ఉందని, బయోమెథేన్ పొటెన్షియల్ (BMP) టెస్టింగ్ ద్వారా పరిశ్రమలు బయోగ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. 2016లో ₹30 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో యూనిట్‌ను స్థాపించిన పేక్స్ ఇండియా, ఇప్పుడు టెస్టింగ్ సేవలను కూడా అందించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *