Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

శ్రీరామ్ నగర్‌ ఏ లో ముమ్మరంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లా హైదరాబాద్ జూలై 16

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రోడ్ మేస్త్రి నగర్ ఏ బూత్ నెంబర్ 320, 307 పరిధిలో బీఎల్‌ఓ, బీఎల్‌ఏలతో కలిసి పర్యటన - ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాల వెరిఫికేషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) వెరిఫికేషన్ ప్రక్రియ…
  • ఇందులో భాగంగా రుడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్-ఏ బస్తీలో ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.
  • ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను తప్పుల్లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు స్థానిక నాయకులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) సంయుక్తంగా బస్తీలో పర్యటించారు.

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రోడ్ మేస్త్రి నగర్ ఏ బూత్ నెంబర్ 320, 307 పరిధిలో బీఎల్‌ఓ, బీఎల్‌ఏలతో కలిసి పర్యటన
– ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాల వెరిఫికేషన్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) వెరిఫికేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా రుడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్-ఏ బస్తీలో ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను తప్పుల్లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు స్థానిక నాయకులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) సంయుక్తంగా బస్తీలో పర్యటించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నెంబర్లు 320, 307 పరిధిలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో ఏవైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలని ప్రజలకు సూచించారు. మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం, చిరునామా మార్పులు లాంటి అంశాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, సమైక్య అధ్యక్షురాలు గుంటి సుజాత .బస్తి ప్రెసిడెంట్ మరియాల మహేష్ .బిఆర్ఎస్ బస్తీ ప్రెసిడెంట్ అరాస్ మహేష్ కుమార్ .శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్ .ఆలయ ధర్మకర్త నేమురి నరేష్ గౌడ్. బద్రి వెంకటరమణయ్య. ఉల్లెంగుల బ్రహ్మచారి. బండ బి సిద్ధులు. బి ఎల్ ఎ కాజా .సుధాకర్ రెడ్డి. స్వరూప బి ఎల్ వో .శ్రావణి బిఎల్ వో .అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *