Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

శృంగవరపుకోట నియోజకవర్గం లో నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శృంగవరపుకోట నియోజకవర్గం లో నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్.కోట నియోజకవర్గంలో నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 30.
  • పున్నమి ప్రతినిధి ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పరిపాలనా అనుమతులు లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
  • హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆమె పేర్కొన్నారు.

ఎస్.కోట నియోజకవర్గంలో నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 30. పున్నమి ప్రతినిధి

ఎస్.కోట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పరిపాలనా అనుమతులు లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆమె పేర్కొన్నారు. గతంలో టైప్ – సి దేవాలయాల నిర్మాణానికి రూ. 20.00 లక్షలు మాత్రమే కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను ఏకంగా రూ. 40.00 లక్షలకు పెంచడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ పరిధిలో మంజూరైన టైప్ – సి దేవాలయాల వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. కొత్తవలస మండలంలో ముసిరాం బీసీ కాలనీలో 30 సెంట్ల స్థలంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం, వీరభద్రపురం బీసీ కాలనీలో 10 సెంట్లలో శ్రీ కోటమ్మ తల్లి దేవాలయం, ఎం.ఆర్.పురం (H/o కొత్తవలస) బీసీ కాలనీలో 50 సెంట్లలో శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయం, రాజపాత్రునిపాలెం మిక్స్‌డ్ కాలనీలో 28 సెంట్లలో శ్రీ శ్రీ శ్రీ రావాలమ్మ తల్లి దేవాలయాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. అలాగే ఎల్.కోట మండలం తామరపల్లి బీసీ కాలనీలో 10 సెంట్లలో శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవాలయం, వేపాడ మండలం కృష్ణరాయుడుపేట బీసీ కాలనీలో 10 సెంట్లలో శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయం నిర్మించనున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ముఖ్య నిబంధనల ప్రకారం, ఆమోదించిన ప్లాన్‌కు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణ పనులన్నింటినీ నిర్దేశిత ఒక సంవత్సరం వ్యవధిలోనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ఎస్.కోట నియోజకవర్గ భక్తుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడులకు నియోజకవర్గ ప్రజల తరఫున ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *