Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు శుభోదయం సోమవారం, శివనామ స్మరణతో!
  • కార్తీక కాంతుల్లో, కైలాసవాసుని రూపం!
  • ఉదయ కిరణాలు తాకే వేళ, ఓంకార నాదంతో, బోళా శంకరుడు మెరిసెను, విభూది కాంతులతో.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు
శుభోదయం సోమవారం, శివనామ స్మరణతో!
కార్తీక కాంతుల్లో, కైలాసవాసుని రూపం!
ఉదయ కిరణాలు తాకే వేళ, ఓంకార నాదంతో,
బోళా శంకరుడు మెరిసెను, విభూది కాంతులతో.
గంగమ్మ శిరసున నర్తించగా, చంద్రవంక చల్లగా,
తొలి పొద్దు వెలుగులో, త్రిశూలం దేదీప్యమానం.
నీలకంఠుని రూపం, నిలువెత్తు కరుణామయం,
కోరిన కోర్కెలు తీర్చే, భోళాతనపు నిలయం.
నందీశ్వరుని అరుపు, డమరుక ధ్వని ప్రతిధ్వని,
ప్రకృతి అంతా పులకించె, పరమేశ్వరుని దర్శనమై.
కార్తీక సోమవారం, కఠిన తపస్సుల ఫలం,
దీపారాధన చేయగా, దీవెనలిచ్చే శివం.
పాపాలు పటాపంచల్, పూజించిన భక్తులకు,
ముక్తిని ప్రసాదించు, ముక్కంటి బోళా శంకర!
హర హర మహాదేవ శంభో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *