Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

శాస్త్రియ విజ్ఞానమే మానవ ప్రగతికి మార్గం :ఎం ఈ ఓ ప్రకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శాస్త్రియ విజ్ఞానమే మానవ ప్రగతికి మార్గం :ఎం ఈ ఓ ప్రకాశం

వార్త ముఖ్యాంశాలు

  • * *శాస్త్రీయ విజ్ఞానమే మానవ ప్రగతికి మార్గం* * *MEO ప్రకాశం*జనగామ మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 విజయవంతం* ​ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో జనగామ మండల స్థాయి…
  • ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా జనగామ మండల విద్యాశాఖ అధికారి (MEO) స్వర్గం ప్రకాశం* హాజరై పోటీలను ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే మూఢనమ్మకాలను వీడి, ప్రతి విషయాన్ని సైన్స్ కోణంలో ఆలోచించేలా ప్రోత్సహించడంలో జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి పోటీలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు.

* *శాస్త్రీయ విజ్ఞానమే మానవ ప్రగతికి మార్గం*
* *MEO ప్రకాశం*జనగామ మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 విజయవంతం*

​ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో జనగామ మండల స్థాయి ‘చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026’ పోటీలు ఇవాన్ దౌగ్లస్ స్కూల్ లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా జనగామ మండల విద్యాశాఖ అధికారి (MEO) స్వర్గం ప్రకాశం* హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే మూఢనమ్మకాలను వీడి, ప్రతి విషయాన్ని సైన్స్ కోణంలో ఆలోచించేలా ప్రోత్సహించడంలో జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి పోటీలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. *కార్యక్రమంలో స్థానిక పాఠశాల కరెస్పాండంట్ జాయ్ డేవిడ్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఉమాదేవి ,మర్రెడ్డి ,చంద్రశేఖర్ రావు పాల్గొని* ప్రసంగిస్తూ, ఇలాంటి పోటీ పరీక్షల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, మేధస్సు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​ఈ పోటీలలో విభాగాల వారీగా విజేతలుగా నిలిచిన పాఠశాలల వివరాలు: *ప్రభుత్వ విభాగంలో ప్రథమ స్థానం PM SHRI ZPHS ధర్మ కంచ , ద్వితీయ స్థానం ZPHS గర్ల్స్ ,జనగామ ; గురుకుల విభాగంలో ప్రథమ స్థానం మహాత్మా జ్యోతిభా పూలే పెంబర్తి ; *ప్రైవేట్ విభాగంలో*
*ఏకశిలా పబ్లిక్ స్కూల్ జనగామ* ,
*సెయింట్ మేరీస్ స్కూల్ హైద్రాబాద్ రోడ్ ,జనగామ* కైవసం చేసుకున్నాయి.* మండల స్థాయిలో గెలుపొందిన ఈ పాఠశాలల జట్లు నవంబర్ 28 వ తేదీన జరిగే జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు అర్హత సాధించాయి. విజేతలకు ముఖ్య అతిథులు, నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.,ఈ కార్యక్రమంలో శోభన్ రెడ్డి ,మధురిమ ,శ్యామ్ ,మల్లారెడ్డి తో పాటు 30 పాఠశాల విద్యార్థులు , గైడ్ టీచర్స్ విద్యార్థులు హాజరయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *