భూపాలపల్లి రూరల్: జిల్లాలో 2026-27 ఆర్థిక సం వత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లుగా నిర్దేశించినట్లు అదనపు కలెక్టర్ అశోక్ వెల్లడిం చారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా విసృత స్థాయిలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. అదనపు కలెక్టర్ అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉపాధి హామీ పథకం తదిత ర నిధులు నిలుపుదల చేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులను ఆపకుండా నేరుగా రైతు లకు ఇవ్వాలని సూచించారు. పంట రుణాలు బాకీ ఉన్న రైతుల జాబితా ఇస్తే అవగాహన కల్పించి రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని సూచిం చారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ నాగరాజ్ , ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంతా సాయి, నాబార్డ్ డీడీఎం రవి మరియు తదితర సంబందించిన బ్యాంకు అధికారులు భూపాలపల్లి జిల్లా ఆర్థిక అక్షరస్యత కౌన్సిలర్స్ పాల్గొన్నారు.
