Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

వైన్ షాప్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష 2 సంవత్సరాలు 6 నెలల జైలు శిక్ష– ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

నేటి శుభోదయ జులై : 22 విశాఖపట్నం జిల్లా చీఫ్ బ్యూరో ) శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మెట్టూరు గ్రామంలో జరిగిన వైన్ షాప్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులకు కొత్తూరు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు కొత్తూరు పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని నాయుడు వైన్ షాప్లో గుమస్తాగా పనిచేస్తున్న బుక్తా ລ້ ລ້ 03-03-2019 తేదీన ఫిర్యాదు చేశారు. 02-03-2019 5 ລ້ 9.30 గంటలకు షాప్ మూసివేసి వెళ్లగా, మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు వచ్చి చూడగా షాప్ తాళాలు పగులగొట్టి, అందులో ఉన్న రూ.1,87,170 విలువైన 32 బాక్సుల మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తూరు ఎస్.ఐ. వై. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసిన ఎస్.ఐ. ఎం. ప్రవళిక నిందితులపై చార్జ్టు న్యాయస్థానంలో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్. నాగభూషణం వాదనలు వినిపించారు. కేసులో నిందితులైన సవర మల్లేష్, సవర మొఖలింగం, సవర సూర్యంలపై అభియోగాలు రుజువయ్యాయని కోర్టు నిర్ధారించింది.దీంతో కొత్తూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరవ కందికట్ల రాణి 21-07-2026 తేదీన తీర్పు వెలువరించారు. నిందితుల ముగ్గురికి 2 సంవత్సరాలు 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు, ప్రతి ఒక్కరికి రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

వైన్ షాప్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష 2 సంవత్సరాలు 6 నెలల జైలు శిక్ష– ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *