Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

పున్నమి న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్, జూలై 23: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను శుక్రవారం (జూలై 24) బంద్ చేసి విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలపాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌ తదితర విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జ్‌పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పాటించి ఉద్యమానికి మద్దతు తెలపాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.

రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *