Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైద్య ఉద్యోగుల సమస్యలపై ఏపీ హంస పోరాటం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైద్య ఉద్యోగుల సమస్యలపై ఏపీ హంస పోరాటం

వార్త ముఖ్యాంశాలు

  • హరినాథపురంలో ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు.
  • రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సంఘం పటిష్టంగా పనిచేస్తోందన్నారు.
  • రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాస్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు.

హరినాథపురంలో ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సంఘం పటిష్టంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాస్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులకు అండగా నిలిచిందన్నారు. మెడికల్ ఆఫీసర్లకు కూడా కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జిల్లా సెక్రటరీ కమల్ కిరణ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *