Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటాచలంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకటాచలంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి ఘనంగా

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 6 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • అన్నమయ్య కీర్తనలను ఆలపించిన గరిమెళ్ల అనిల్ కుమార్‌ను అభినందించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 6 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నమయ్య కీర్తనలను ఆలపించిన గరిమెళ్ల అనిల్ కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ కళలు, భాష, సంస్కృతి మన అస్తిత్వానికి మూలస్తంభాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు జీవితాన్ని అంకితం చేసిన దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు నివాళులర్పిస్తూ, ఆయన సేవలను కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *