Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ పత్రిక ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ పత్రిక ఆవిష్కరణ

(పున్నమి ప్రతినిధి చందు): తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఫిబ్రవరి 15, 2026 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన తాళ్లపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మదన గోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ పత్రికను ఆవిష్కరించారు. మండలంలోని స్త్రీ-పురుషులు సతీసమేతంగా హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గానుగుల వరహాలు, మండల అధ్యక్షులు పట్నాల సతీష్, ఉపాధ్యక్షులు బాబు, కార్యదర్శి కడలి కిరణ్ కుమార్, కోశాధికారి ముత్తోజు మురళి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ పత్రిక ఆవిష్కరణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *