Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి

విశ్వనాధపురంలో ఆదివారం “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి” నినాదంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ ఇన్‌చార్జ్ షేక్ శిరాజ్ బాషా, బూత్ కన్వీనర్ అతికారి మహేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు.

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారని వారు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *