Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .
  • -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.
  • -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .

-విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.
-జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.

*విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి * : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.

కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 22 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *