Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ నియామకం

విశాఖపట్నం, జనవరి (పున్నమి ప్రతినిధి):

విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు (G.O) జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులు, యువత, సాధారణ పాఠకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా పరిధిలో గ్రంథాలయాలను ఆధునికీకరణ చేయడంతో పాటు చదువు సంస్కృతిని ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు.

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ నియామకం

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వన్నెంరెడ్డి సతీష్ కుమార్ నియామకం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *