Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖపట్నం రూరల్‌లో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025 వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖపట్నం రూరల్‌లో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025 వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం రూరల్ మండలం, కే.కోటపాడు సమీపంలోని చంద్రయ్యపేట గ్రామం దరిదాట్ల లేఅవుట్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం మరియు లలితా గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025” పేరుతో వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి…
  • దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులకు జీతభత్యాలను క్రమబద్ధంగా అందించడమే కాకుండా, ఇనాం భూముల ఆదాయాన్ని అర్హులైన అర్చకులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని బండారు సత్యనారాయణమూర్తి సభాముఖంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది బ్రాహ్మణులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని వనసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయ…

విశాఖపట్నం రూరల్ మండలం, కే.కోటపాడు సమీపంలోని చంద్రయ్యపేట గ్రామం దరిదాట్ల లేఅవుట్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం మరియు లలితా గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025” పేరుతో వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అలాగే రాష్ట్ర అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి, అధికార ప్రతినిధి డా.పెంట శేషుబాబు శర్మ, రాష్ట్ర కోశాధికారి దంతుర్తి కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు న్యాసావఝ్జల ప్రశాంత్, భాస్కర పట్ల సత్యప్రసాద్ శర్మ, గంటి భాస్కర్, దంతుర్తి కాశీ విశ్వనాథ శర్మ, దూర్వాసులు సాయి, చామర్తి కేశవాచార్యులు, రాచకొండ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులకు జీతభత్యాలను క్రమబద్ధంగా అందించడమే కాకుండా, ఇనాం భూముల ఆదాయాన్ని అర్హులైన అర్చకులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని బండారు సత్యనారాయణమూర్తి సభాముఖంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది బ్రాహ్మణులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని వనసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *