వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్ : వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చిట్వేల్ పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.
- రేణిగుంట డీఎస్పీ, కోడూరు రూరల్ సీఐ సూచనల మేరకు చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చిట్వేల్ పోలీస్స్టేషన్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
- వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నారు.
చిట్వేల్ : వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చిట్వేల్ పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. రేణిగుంట డీఎస్పీ, కోడూరు రూరల్ సీఐ సూచనల మేరకు చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చిట్వేల్ పోలీస్స్టేషన్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్య నివారణ, విద్యుత్, అగ్ని ప్రమాదాల నియంత్రణతోపాటు భక్తులు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులకు పోలీసు అధికారులు సూచనలు చేయనున్నారు. చిట్వేల్ పోలీస్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరై పోలీసుల సూచనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్ఐ వినోద్ కుమార్ కోరారు.