Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మానవత్వానికి నిలువుటద్దం *786 రఫీ సేవా సంస్థ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మానవత్వానికి నిలువుటద్దం *786 రఫీ సేవా సంస్థ*

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా నాయుడుపేట సమాజంలో కష్టం ఉన్న చోట నేనున్నానంటూ ముందుకొచ్చి, బాధితులకు కొండంత అభయాన్ని ఇచ్చే అరుదైన వ్యక్తుల్లో *786 రఫీ* ఒకరు.
  • కేవలం సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువు, క్రీడలలో భవిష్యత్తులో ఏ ఒక్కరికి ఆగిపోకూడదనే ఉద్దేశంతో '786 సేవా సంస్థ' ద్వారా నిరంతరం శ్రమిస్తున్నారు.
  • క్రీడాకారులకు కొండంత అండ - ఇటీవల నాయుడుపేట బిరదవాడ డాక్టర్ బి.ఆర్.

తిరుపతి జిల్లా నాయుడుపేట సమాజంలో కష్టం ఉన్న చోట నేనున్నానంటూ ముందుకొచ్చి, బాధితులకు కొండంత అభయాన్ని ఇచ్చే అరుదైన వ్యక్తుల్లో *786 రఫీ* ఒకరు. కేవలం సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువు, క్రీడలలో భవిష్యత్తులో ఏ ఒక్కరికి ఆగిపోకూడదనే ఉద్దేశంతో ‘786 సేవా సంస్థ’ ద్వారా నిరంతరం శ్రమిస్తున్నారు.

క్రీడాకారులకు కొండంత అండ – ఇటీవల నాయుడుపేట బిరదవాడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన 20 మంది విద్యార్థినులకు 786 సేవా సంఘం ద్వారా రఫీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ టీ-షర్టులు, షార్ట్లు, క్యాప్స్ మరియు షూస్ పంపిణీ చేశారు. క్రీడల్లో విద్యార్థినులు మరింత రాణించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

*సేవా కార్యక్రమాల విస్తృతి*
*పండుగల్లో చేయూత:* ప్రతి పండుగ సందర్భంలోనూ పేదలకు, నిరుపేద కుటుంబాలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తూ పండుగ వెలుగులను పంచుతారు.

*విద్యార్థులకు నిరంతర సహాయం :* స్కూల్కి అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, క్రీడా పరికరాలు ఉచితంగా అందజేస్తూ పేద విద్యార్థుల చదువుకి తోడ్పడుతున్నారు. అలాగే అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు అవసరమైన నిత్యవసరాలు సమకూరుస్తూ ఆకలి తీరుస్తున్నారు.

ఆపద్బాంధవుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద సంభవించినా ‘నేనున్నాను’ అంటూ మానవత్వంతో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. స్వార్థం నిండిన రోజుల్లో రఫీ చేస్తున్న ఈ నిరంతర సామాజిక సేవ ఎందరికో ఆదర్శనీయం. నిలవాలని ఈ కార్యక్రమంలో పాఠశాల పీ.ఈ.టీ.లు మరియు 786 సేవా సంఘం సభ్యులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *