Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

ఇచ్చోడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలను వీక్షించారు. కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే పనులకు భూమిపూజ చేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తన చదువు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగిందని, ఉపాధ్యాయులే దేవుళ్లని పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా తనను అన్నగా భావించి సంప్రదించాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఇచ్చోడ హైస్కూల్‌కు రూ.5 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *