చెన్నరావుపేట :పున్నమి తెలుసు దినపత్రిక : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెన్నారావుపేట మరియు నెక్కొండ మండలాలలో పనిచేస్తున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఎంఈఓ మానుపాటి పాపమ్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి రిసోర్స్ పర్సన్లుగా పిన్నింటి బాలాజీ రావు, కొండ కృష్ణమూర్తి, శ్రీనివాస్, గురుదేవ్ వ్యవహరించి ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రధానంగా వర్క్‌బుక్స్‌లోని అన్ని వర్క్‌షీట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం, విద్యార్థులకు ప్రతి యూనిట్‌లోని అభ్యాస కార్యక్రమాలను ఎలా పూర్తి చేయించాలి అనే అంశాలపై పరక్-2027 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఐటమ్ బ్యాంకులు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, అందుబాటులో ఉన్న విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రిసోర్స్ పర్సన్ పిన్నింటి బాలాజీ రావు సూచించారు.పరక్ నమూనా ప్రశ్నలతో స్లిప్ టెస్టులు, సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలకు అవసరమైన ప్రశ్నలను రూపొందించడంపై రిసోర్స్ పర్సన్ కొండా కృష్ణ మూర్తి, శ్రీనివాస్,గురుదేవ్ వివరించారు.తరగతి గది బోధనలో కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగించి బోధనా అభ్యసన ప్రక్రియ మరింత ప్రభావవంతంగా ఎలా నిర్వహించవచ్చో వివరించారు. నిష్ఠ రెండవ విడత కోర్సులను దీక్ష వేదిక ద్వారా పూర్తి చేయడం, సమావేశంలో చర్చించిన అంశాలను తరగతి గదుల్లో ఆచరణలో పెట్టడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లు సూచించారు.ఈ సమావేశంలో చెన్నారావుపేట మరియు నెక్కొండ మండలంలోని ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సి ఆర్ పి సంపత్ పాల్గొన్నారు

వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన