Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

రంగాపురంలో భూములరీసర్వే అవగాహనా కార్యక్రమం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రంగాపురంలో భూములరీసర్వే అవగాహనా కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం రంగాపురం గ్రామంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీఓ, ఏడీ, ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు రైతు సోదర సోదరీమణులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిండి అనూష కుమార్ మాట్లాడుతూ రైతులకు భూమి ఎంతో విలువైన ఆస్తి అని, ఎన్నో సంవత్సరాలుగా భూముల హద్దులు, విస్తీర్ణాలు, సర్వే నంబర్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రీ సర్వే ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించి, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. రైతులందరూ అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రంగాపురంలో భూములరీసర్వే అవగాహనా కార్యక్రమం.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *