Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో గ్యాస్ గోడౌన్ సమీపంలో అగ్నిప్రమాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వింజమూరులో గ్యాస్ గోడౌన్ సమీపంలో అగ్నిప్రమాదం

వింజమూరు పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో ఉన్న స్క్రాప్ ఏరియాలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్‌లోని చెత్తకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.మంటలు ఒక్కసారిగా పెద్దఎత్తున వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల ధాటికి స్క్రాప్ ఏరియాలో ఉన్న పలు పరికరాలు, వివిధ రకాల సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గ్యాస్ గోడౌన్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంటలు గ్యాస్ గోడౌన్ వైపు వ్యాపించకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతమేరకు ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియసి ఉంది

వింజమూరులో గ్యాస్ గోడౌన్ సమీపంలో అగ్నిప్రమాదం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *