Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బిక్కవోలులో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

దేశ రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు వాజ్‌పేయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *