Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….కలిగిరి సర్కిల్ సీఐ వెంకటనారాయణ.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….కలిగిరి సర్కిల్ సీఐ వెంకటనారాయణ.

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి, అక్టోబర్ 22 :(పున్నమి ప్రతినిధి ):// ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణ కోరారు.
  • మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు.
  • బంగాళాఖాతం లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీనివల్ల భారీ వర్షాలు పడతాయన్నారు.

కలిగిరి, అక్టోబర్ 22 :(పున్నమి ప్రతినిధి )://

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణ కోరారు. మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. బంగాళాఖాతం లో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీనివల్ల భారీ వర్షాలు పడతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కలిగిరి సర్కిల్ సిఐ వెంకటనారాయణకోరారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాల ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *