Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం

వార్త ముఖ్యాంశాలు

  • వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం వరదయ్యపాలెం: బస్టాండ్ వద్ద తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి) ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించాలని గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
  • ఆలయ చైర్మెన్, విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొప్పన రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు.
  • ఎన్నో ఏళ్లుగా ఆలయం లేకపోవడంతో భక్తులు ఎండ, వానలకు ఇబ్బంది పడుతున్నారు.

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం

వరదయ్యపాలెం: బస్టాండ్ వద్ద తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి) ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించాలని గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఆలయ చైర్మెన్, విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొప్పన రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఆలయం లేకపోవడంతో భక్తులు ఎండ, వానలకు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల మనోభావాలను గుర్తించి గ్రామపెద్దల సహకారంతో నూతన ఆలయ నిర్మాణానికి బొప్పన రమేష్ చొరవ తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బొప్పన చంద్రబాబు @చిన్ని, బీజేపీ మండల అధ్యక్షుడు దిలీప్ రాయల్, టీడీపీ మహిళా నాయకురాలు మునిభూషణమ్మ, గ్రామ పెద్దలు పృధ్వీ భవరాజు, లక్ష్మయ్య, కల్లూరు బాలసుందరం, దొడ్డి మునికృష్ణయ్య, కాట్ కుమార్, సామ్రాట్, గుత్తి సురేష్, ఆలయ అర్చకులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

🙏 ఓం శ్రీ సిద్ధేశ్వర స్వామియే నమః 🙏

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద కొలువైన
శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి)
ఆలయ జీర్ణోద్ధరణ & నూతన నిర్మాణానికి
గ్రామపెద్దల ఏకగ్రీవ నిర్ణయం

ఆలయ చైర్మెన్:
శ్రీ బొప్పన రమేష్ గారు
విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్

భక్తులందరి సహకారం కోరుతున్నాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *