వడ్లకొండ నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతికంగా ఛార్జింగ్
——————————————————————–
జనగామ డివిజన్, జనగామ రూరల్ సెక్షన్ పరిధిలో నూతనంగా నిర్మించిన వడ్లకొండ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు సాంకేతికంగా ఛార్జింగ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ
ఈ నూతన విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఉన్న పట్టణ విద్యుత్ ఉపకేంద్రాలపై లోడ్ భారం తగ్గనుంది. జనగామ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా అందించేందుకు దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ (కన్స్ట్రక్షన్) జయవంత్ రావు చౌహాన్ , ఎస్ఈ (ఆపరేషన్) జనగామ చెరుకు సంపత్ రెడ్డి, డిఈ (ఆపరేషన్ / జనగాం) లక్ష్మీనారాయణ రెడ్డి, డీఈ (ఎంఆర్టీ అండ్ సీ) విజయ్ , ఈఈ (సివిల్) హనుమకొండ అనూప్ కుమార్ , ఏడీఈ (కన్స్ట్రక్షన్) స్వామి రెడ్డి , ఏడీఈ (ఆపరేషన్) వేణుగోపాల్ , ఏడిఈ(సివిల్) హుస్సేన్ , ఏఈ (ఆపరేషన్, జనగామ రూరల్) మధు, ఏఈ (సివిల్ ) రాజశేఖర్ తదితర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

