Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా : ముక్కా సాయి వికాస్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని వెల్లడి ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీ పరిధిలోని సీఎం బలిజపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా : ముక్కా సాయి వికాస్ రెడ్డి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని వెల్లడి

ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీ పరిధిలోని సీఎం బలిజపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పెన్షన్ పొందిన లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *