వార్త ముఖ్యాంశాలు
- రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి --జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ----------------------------------------------------------- జనగామ, ఆగష్టు 20,పున్నమి జిల్లా ప్రతినిధి : పంటల సాగులో భూసార పరీక్షలు, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి, నర్మెట్ట మండలంలోని నర్మెట్ట గ్రామంలో మిర్చి, కందులు, కూరగాయల…
- పంటల సాగు విధానం, నీటి వసతి, డ్రిప్ సౌకర్యం, భూసార పరిస్థితులు, తెగుళ్ల నివారణ, పంటల ద్వారా వస్తున్న ఆదాయం, తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా *రైతు భిక్షపతి* సాగు చేస్తున్న మిర్చి పంటను *కలెక్టర్* పరిశీలించారు.
రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి
–జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
———————————————————–
జనగామ, ఆగష్టు 20,పున్నమి జిల్లా ప్రతినిధి :
పంటల సాగులో భూసార పరీక్షలు, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి,
నర్మెట్ట మండలంలోని నర్మెట్ట గ్రామంలో మిర్చి, కందులు, కూరగాయల పంటలను పరిశీలించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ
రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని,
గురువారం, జిల్లాలోని నర్మెట్ట మండలం, నర్మెట్ట గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యటించి, రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పంటల సాగు విధానం, నీటి వసతి, డ్రిప్ సౌకర్యం, భూసార పరిస్థితులు, తెగుళ్ల నివారణ, పంటల ద్వారా వస్తున్న ఆదాయం, తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా *రైతు భిక్షపతి* సాగు చేస్తున్న మిర్చి పంటను *కలెక్టర్* పరిశీలించారు. ఒక ఎకరంలో సాగు చేస్తున్న మిర్చి పంటలో డ్రిప్ సౌకర్యం, మొక్కల ఎదుగుదల, పంట ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.
పంటకు సోకుతున్న తెగుళ్ల వివరాలను రైతును అడిగి తెలుసుకున్న *కలెక్టర్*, తెగుళ్లు, వ్యాధులను ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పంటలపై అధికంగా రసాయన మందుల వినియోగం తగ్గించి, సాధ్యమైనంత వరకు ప్రకృతి ఆధారిత, సహజ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
నేల ఆరోగ్యం దెబ్బతినకుండా భూమి సారాన్ని కాపాడే విధంగా సేంద్రియ, జీవ ఆధారిత ఇన్పుట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పంటలకు అవసరమైన పోషకాలు, భూమి స్వభావాన్ని అంచనా వేసేందుకు క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
అదే విధంగా రైతు వద్ద ఉన్న బోరు బావుల నీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, డ్రిప్ ద్వారా నీటి వినియోగం, తదితర వివరాల గురించి *కలెక్టర్* ఆరా తీశారు.
తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా సూక్ష్మ నీటిపారుదల విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పంటల సాగు NRF పథకం కింద చేపడుతున్నారా? లేదా? అనే వివరాలను కూడా అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కూరగాయల పంటలను కూడా *కలెక్టర్* పరిశీలించారు. పంటలకు పెట్టుబడి ఎంత అవుతోంది? దిగుబడి ఎంత వస్తోంది? మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? పంట ద్వారా రైతుకు లభిస్తున్న ఆదాయం ఎంత? అనే అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం *రైతు వెంకట్ రెడ్డి* సాగు చేస్తున్న మూడు ఎకరాల కందుల పంటను *కలెక్టర్* పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్యం, నీటి వినియోగం, భూమి పరిస్థితి, తదితర అంశాలను పరిశీలించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున భూసార పరీక్షలు నిర్వహించి, నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుని, దానికి అనుగుణంగా ఎరువులు, పోషకాలను వినియోగించాలని సూచించారు.
వాతావరణ మార్పులు వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, సాగు పద్ధతులు, నీటి యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణలో శాస్త్రీయ విధానాలను పాటించాలని *కలెక్టర్* పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు.
వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణ, నీటి పొదుపు, భూసార పరిరక్షణ, ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ ఆధారిత సాగుపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, ఇతర సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.