వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
- నెల్లూరు నగరంలోని బీద రవిచంద్ర నివాసానికి వెళ్లిన రూప్‌కుమార్ యాదవ్‌కు ఘనస్వాగతం లభించింది.
- ఈ సందర్భంగా బీద రవిచంద్ర ఆయనను శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు నగరంలోని బీద రవిచంద్ర నివాసానికి వెళ్లిన రూప్‌కుమార్ యాదవ్‌కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీద రవిచంద్ర ఆయనను శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ భారీ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నెల్లూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని బీద రవి చంద్ర ఆకాంక్షించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్