Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

వార్త ముఖ్యాంశాలు

  • కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమం అమలులో భాగంగా శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీవో సరళాదేవి సమక్షంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా…
  • రీ-సర్వే సందర్భంగా రైతులకు పూర్తి అవగాహన, సమాచారం కల్పించాలని, వారికి తలెత్తే అన్ని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు.
  • రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సున్నితంగా మరియు పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమం అమలులో భాగంగా శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీవో సరళాదేవి సమక్షంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రీ-సర్వే కార్యక్రమం అమలుపై దాట్ల సుబ్బరాజు అధికారులకు పలు స్పష్టమైన సూచనలు చేశారు. రీ-సర్వే సందర్భంగా రైతులకు పూర్తి అవగాహన, సమాచారం కల్పించాలని, వారికి తలెత్తే అన్ని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సున్నితంగా మరియు పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైన అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రీ-సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలనిదాట్ల సుబ్బరాజు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *