Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

రిటైర్డ్ టీచర్ ఇరికిరెడ్డి గంగిరెడ్డి స్మారకార్థం దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రిటైర్డ్ టీచర్ ఇరికిరెడ్డి గంగిరెడ్డి స్మారకార్థం దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ.

వార్త ముఖ్యాంశాలు

  • సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె మారుమూల గ్రామంలో జన్మించి, 60వ దశకంలోనే, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, అప్పట్లోనే బిఈడి కోర్సు పూర్తిచేసి, ఉపాధ్యాయుడిగా అంకాలమ్మగూడూరు, సింహాద్రిపురం, మురారిచింతల, కోమన్నూతల, పాయసంపల్లె, చిలమకూరు, వేల్పుల తదితర ప్రాంతాల స్కూళ్లలో హెడ్మాస్టర్ గా, మారుమూల గ్రామాలలో ఆర్ఎంపి డాక్టర్ గా ఉచిత వైద్యసేవలoదించి,…
  • అనంతరం రఘునాథరెడ్డి సమకూర్చిన నిత్యావసర సరుకులు, బ్లాంకెట్స్ దివ్యాంగులకు పంపిణీ చేశారు.
  • తదనంతరం స్వీట్లు, పండ్లు అందించారు.* *ఈకార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్రఅధ్యక్షులు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, ఆయన కుమారుడు డా.

సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె మారుమూల గ్రామంలో జన్మించి, 60వ దశకంలోనే, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, అప్పట్లోనే బిఈడి కోర్సు పూర్తిచేసి, ఉపాధ్యాయుడిగా అంకాలమ్మగూడూరు, సింహాద్రిపురం, మురారిచింతల, కోమన్నూతల, పాయసంపల్లె, చిలమకూరు, వేల్పుల తదితర ప్రాంతాల స్కూళ్లలో హెడ్మాస్టర్ గా, మారుమూల గ్రామాలలో ఆర్ఎంపి డాక్టర్ గా ఉచిత వైద్యసేవలoదించి, విశ్వసనీయత, విలువలతో కూడిన జీవితాన్ని గడిపి, అందరి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం పొందిన గంగిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, డాక్టర్ ఇరికిరెడ్డి అభిలాష్ రెడ్డి తదితరులు ప్రతియేటా దివ్యాంగులకు సహాయసేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు విశ్రాంత అధ్యాపకులు యడుగూరి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.*
*పట్టణంలోని ముద్దనూరురోడ్డులో గల వికలాంగుల కమ్యూనిటీ భవనoలో దివంగత ఇరికిరెడ్డి గంగిరెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకొని, వారి కుమారుడు ఇరికిరెడ్ది రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీనివాసుల రెడ్డి తదితరులు గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, ఘననివాళులర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రఘునాథరెడ్డి సమకూర్చిన నిత్యావసర సరుకులు, బ్లాంకెట్స్ దివ్యాంగులకు పంపిణీ చేశారు. తదనంతరం స్వీట్లు, పండ్లు అందించారు.*
*ఈకార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్రఅధ్యక్షులు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, ఆయన కుమారుడు డా. ఇరికిరెడ్డి అభిలాష్ రెడ్డి, వికలాంగుల సంఘ కార్యవర్గ సభ్యులు గంగనపల్లె హరికృష్ణ, మహేశ్వర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *