Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ.
  • గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ.
  • గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.

జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది.
అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు.
ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *