Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కామారెడ్డి

రామారెడ్డి మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రామారెడ్డి మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో ట్రాక్టర్‌తో ఇసుక దోపిడీ..
  • కన్నాపూర్‌లో శివారులో పట్టుకుని కేసు!
  • కామారెడ్డి,2 ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) :.

రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో ట్రాక్టర్‌తో ఇసుక దోపిడీ..

కన్నాపూర్‌లో శివారులో పట్టుకుని కేసు!

కామారెడ్డి,2 ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) :.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపెట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుం డా దూసుకెళ్లిన ట్రాక్టర్ రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో కొయ్యల లింబాద్రి అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఎలాంటి అను మతులు లేకుండా పెద్దఎత్తుగా ఇసుకను అక్ర మంగా తరలిస్తూ.. కన్నాపూర్ శివారులో పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కఠిన కేసు నమోదు చేశామన్నారు. ఇది కేవలం ఒక్క ట్రాక్టర్ కాదు – ఇసుక మాఫియా దూకుడుకు సవాలైన చర్య!ఎస్ఐ రాజశేఖర్ స్పష్టమైన హెచ్చరిక.. ఎవరినీ వదలమని చెప్పారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధ పనులు చేస్తే.. ఎవరినీ చూడకుండా కేసులు నమోదు చేస్తామంటూ ఎస్ఐ రాజశేఖర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. మండలంలో ఇసుక దోపిడీకి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీవ్రత రం చేపడుతున్నామని అన్నారు. స్థానికుల సర్దు కునేలా, చట్టాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు.మండలంలో ఇసుక మాఫియా దూకుడు వెంటనే ఆపివేయాల న్నారు. రామారెడ్డి మండలంలో ఇలాంటి అక్రమ ఇసుక రవాణా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పర్యావరణానికి, చట్టానికి గట్టి దెబ్బ తీస్తున్న ఈ మాఫియా కార్యకలాపాలకు పోలీసులు గట్టిగా బుద్ది చెపుతామన్నారు. స్థానిక ప్రజలు అపోహలు వదిలి, సమాచారం అందించాలని పిలుపు నిచ్చా రు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *