వార్త ముఖ్యాంశాలు
- కామారెడ్డి, 25 ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్ తండా-2లో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదని, తప్పుడు ప్రచారా లను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
- తండాలో కొందరిని గ్రామ బహిష్కరణ చేశారంటూ,వస్తున్న వార్తలపై గ్రామ పెద్దలు, ప్రజ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భం గా విలేకరుల సమావేశంలో తండా వాసులు మాట్లాడుతూ...తమ తండాలోని ప్రజలందరం గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ కలిసికట్టుగా జీవిస్తున్నామని తెలిపారు.
- మాది ఒకటే గిరిజన కులం...ఇక్కడ ఎవరినీ కుల బహి ష్కరణ చేయలేదు, చేసే ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చిచెప్పారు.
కామారెడ్డి, 25 ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్ తండా-2లో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదని, తప్పుడు ప్రచారా లను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. తండాలో కొందరిని గ్రామ బహిష్కరణ చేశారంటూ,వస్తున్న వార్తలపై గ్రామ పెద్దలు, ప్రజ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భం గా విలేకరుల సమావేశంలో తండా వాసులు మాట్లాడుతూ…తమ తండాలోని ప్రజలందరం గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ కలిసికట్టుగా జీవిస్తున్నామని తెలిపారు. మాది ఒకటే గిరిజన కులం…ఇక్కడ ఎవరినీ కుల బహి ష్కరణ చేయలేదు, చేసే ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చిచెప్పారు. వ్యక్తిగత కారణాలు లేదా చిన్న పాటి మనస్పర్థలను గ్రామానికి ఆపాదిస్తూ, తండా పరువు తీసేలా కొందరు తప్పుడు ఆరోపణలు చే స్తున్నారని మండిపడ్డారు.గ్రామంలో శాంతి భద్ర తలకు ఎలాంటి విఘాతం కలగలేదని, అందరం ఐకమత్యంతోనే ఉన్నామని స్పష్టం చేశారు.బాధ్య తారాహిత్యంగా లేనిపోని వదంతులు వ్యాప్తి చేస్తూ గ్రామంపై బురదజల్లే ప్రయత్నం చేస్తూన్నారని ఆవే దన వ్యక్తం చేశారు.తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని తండా పెద్దలు, యువకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఉపసర్పంచ్ తిరుపతి మాజీ ఎంపిటిసి శంకర్, గ్రామ కరోబార్ శంకర్, శ్రీరామ్ లౌడియా, బాలావత్ పంతులు, గణేష్, సేవ్య, తాండ పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.