వార్త ముఖ్యాంశాలు
- -ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రామాయపట్నంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆమోదం తెలపడంపై ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.
- రిఫైనరీ నిర్మాణ దశ నుంచే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.
- రవాణా, సరఫరా, నిర్వహణ వంటి అనుబంధ రంగాల్లోనూ ఉపాధి లభిస్తుందని వివరించారు.
-ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
రామాయపట్నంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆమోదం తెలపడంపై ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు. రిఫైనరీ నిర్మాణ దశ నుంచే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. రవాణా, సరఫరా, నిర్వహణ వంటి అనుబంధ రంగాల్లోనూ ఉపాధి లభిస్తుందని వివరించారు. రామాయపట్నం రిఫైనరీ నెల్లూరు జిల్లాతో పాటు దక్షిణాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందని, దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుందని అజీజ్ అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు అబ్దుల్ అజీజ్ అభినందనలు తెలిపారు.