Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

రామవరంలో దోమల నివారణకు ఫాగింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రామవరంలో దోమల నివారణకు ఫాగింగ్

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు,19,(పున్నమి ప్రతినిధి)

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్‌లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో మంగళవారం దోమల నివారణ కోసం ఫాగింగ్ నిర్వహించారు. రామవరం మార్కెట్ నుంచి నెహ్రూ బస్తీ, లక్ష్మీ టాకీస్ ప్రాంతం, నేతాజీ బస్తీ, నాగయ్యగడ్డ, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో దోమల నివారణ పొగను పిచికారీ చేశారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్ సూచించారు. పారిశుధ్య సమస్యలపై ప్రజలు వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.

రామవరంలో దోమల నివారణకు ఫాగింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *