Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

రాంపల్లిలో పేరుకుపోతున్న చెత్త కుప్పలు.. మరో జవహర్‌నగర్‌గా మారుతున్న గ్రామం రాంపల్లి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాంపల్లిలో పేరుకుపోతున్న చెత్త కుప్పలు.. మరో జవహర్‌నగర్‌గా మారుతున్న గ్రామం రాంపల్లి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

వార్త ముఖ్యాంశాలు

  • రాంపల్లిలో పేరుకుపోతున్న చెత్త కుప్పలు..
  • మరో జవహర్‌నగర్‌గా మారుతున్న గ్రామం రాంపల్లి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిపివేసిన రాంకీ సంస్థ స్థానికంగానే డంపింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లు..
  • దుర్వాసనతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించకపోతే భారీ ఎత్తున ధర్నాలు తప్పవని హెచ్చరిక రాంపల్లి: మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని రాంపల్లి గ్రామం అక్రమ డంపింగ్ యార్డుగా మారుతోందని, చెత్త సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్…

రాంపల్లిలో పేరుకుపోతున్న చెత్త కుప్పలు.. మరో జవహర్‌నగర్‌గా మారుతున్న గ్రామం రాంపల్లి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిపివేసిన రాంకీ సంస్థ
స్థానికంగానే డంపింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
అధికారులు తక్షణమే స్పందించకపోతే భారీ ఎత్తున ధర్నాలు తప్పవని హెచ్చరిక
రాంపల్లి:
మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని రాంపల్లి గ్రామం అక్రమ డంపింగ్ యార్డుగా మారుతోందని, చెత్త సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా ఇక్కడి నుంచి చెత్తను తరలించాల్సిన రాంకీ సంస్థ లిఫ్టింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో సమస్య జటిలంగా మారిందని వారు పేర్కొన్నారు.
గ్రామంలో సేకరించిన వ్యర్థాలను ఆటో డ్రైవర్లు అక్కడే డంప్ చేసి వెళ్లిపోతుండటంతో పెద్ద ఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వర్షాలు, ఎండల కారణంగా చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాంపల్లి మరో జవహర్‌నగర్ డంపింగ్ యార్డులా తయారవుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ — “సంబంధిత అధికారులు,MMC యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా సమస్య కనిపిస్తున్నా రాంకీ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణమే పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తరలించి, అక్కడ బ్లీచింగ్ తదితర పారిశుధ్య చర్యలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే, స్థానిక ప్రజలతో కలిసి MMC కార్యాలయం మరియు ఘట్కేసర్ ఎదుట, ప్రధాన రహదారులపై భారీ ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *