Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

యాదవుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యాదవుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల యాదవుల కార్తీక వనభోజన మహోత్సవాన్ని కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణుని మందిరం నందు ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొన్నారు.
  • ముందుగా శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.

నంద్యాల యాదవుల కార్తీక వనభోజన మహోత్సవాన్ని కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణుని మందిరం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో హిందూ సాంప్రదాయంలో వనభోజన కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని. ఈ కార్యక్రమంలో యాదవ సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని, కలిసి భోజనాలు చేస్తూ, ఆధ్యాత్మిక చర్చలతో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవ సంఘటిత శక్తిని చాటిచెప్పిన ఈ యాదవ కార్తీక వనభోజన మహోత్సవం మత సామరస్యాన్ని, సామాజిక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తూ, అందరిలో ఆధ్యాత్మిక భావనను పెంచిందన్నారు

ఈ కార్యక్రమంలో యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్,కొండా శ్రీనివాస్ యాదవ్, నాగేశ్వరరావు యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , హరి యాదవ్, భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , నాగరాజు యాదవ్, నాగమధు యాదవ్, శివ కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొనారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *