Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొదటిసారిగా పోటీ చేస్తున్నా.. నాకు రాజకీయ భిక్ష పెట్టండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొదటిసారిగా పోటీ చేస్తున్నా.. నాకు రాజకీయ భిక్ష పెట్టండి

వార్త ముఖ్యాంశాలు

  • 30వ డివిజన్ జనసేన అభ్యర్థి నూనె రిషికేశ్ యాదవ్ నవంబర్ 1న జరిగే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తాను జనసేన అభ్యర్థిగా 30వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానని, తనకు రాజకీయ భిక్ష పెట్టాలని ఆ డివిజన్ జనసేన అభ్యర్థి రిషికేశ్ యాదవ్ 30వ డివిజన్ ప్రజలకు…
  • గురువారం ఆయన డివిజన్ పరిధిలోని నక్కలగుంట, వనంతోపు తదితర ప్రాంతాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా రిషికేశ్ మాట్లాడుతూ తన తండ్రి నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు ప్రజలకు సుపరిచితులని, ఆయన గతంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా, కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారని తెలిపారు.

30వ డివిజన్ జనసేన అభ్యర్థి నూనె రిషికేశ్ యాదవ్

నవంబర్ 1న జరిగే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తాను జనసేన అభ్యర్థిగా 30వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానని, తనకు రాజకీయ భిక్ష పెట్టాలని ఆ డివిజన్ జనసేన అభ్యర్థి రిషికేశ్ యాదవ్ 30వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన డివిజన్ పరిధిలోని నక్కలగుంట, వనంతోపు తదితర ప్రాంతాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రిషికేశ్ మాట్లాడుతూ తన తండ్రి నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు ప్రజలకు సుపరిచితులని, ఆయన గతంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా, కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారని తెలిపారు. తమ కుటుంబం 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉందని, కనుక 30వ డివిజన్ ప్రజలు తమపై దయ ఉంచి నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి తనను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసం తమ కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంటుందని, తమ ప్రతినిధిగా తమ కుమారుడు రిషికేశ్ యాదవ్‌ను జనసేన పార్టీ నుంచి 30వ డివిజన్ అభ్యర్థిగా బరిలోకి దింపామని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ తమను అర్థం చేసుకొని, తమ ఓటు ద్వారా సహాయం చేసి తన బిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *