Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

మొక్కలు పంచుతూ.. పచ్చని భవిష్యత్తుకు బాటలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మొక్కలు పంచుతూ.. పచ్చని భవిష్యత్తుకు బాటలు

వార్త ముఖ్యాంశాలు

  • సరండి గ్రామంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: కొట్రాంగే మేంఘజి వాంకిడి, జూలై 23: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధే లక్ష్యంగా సరండి గ్రామ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొట్రాంగే మేంఘజి చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి గ్రామస్తుల…
  • గ్రామపంచాయతీ పరిధిలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తూ ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
  • ఈ సందర్భంగా మేంఘజి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.

సరండి గ్రామంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: కొట్రాంగే మేంఘజి

వాంకిడి, జూలై 23: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధే లక్ష్యంగా సరండి గ్రామ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొట్రాంగే మేంఘజి చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. గ్రామపంచాయతీ పరిధిలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తూ ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మేంఘజి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
మొక్కల పంపిణీ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమైన ఆయన తాగునీటి సమస్యలు, రోడ్ల పరిస్థితి, విద్యుత్ సరఫరా, రైతుల ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలు, విద్యా సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో పచ్చదనంతో పాటు పారిశుధ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన గ్రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రైతులు వ్యవసాయ భూముల సరిహద్దుల్లో విలువైన మొక్కలు పెంచితే భవిష్యత్తులో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
గ్రామాభివృద్ధి ప్రభుత్వంతో మాత్రమే సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్న మేంఘజి, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
మేంఘజి చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, మహిళలు, యువత అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ప్రతి సంవత్సరం పెద్దఎత్తున మొక్కల పంపిణీ చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *