*గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తా.. ప్రజాసేవకు అవకాశం కల్పించండి!*
*కూటమి ప్రభుత్వంతోనే గ్రామ అభివృద్ధి….*
*ప్రజలతో మమేకమవుతూ బడుగు జనార్ధనరావు ప్రచారం*
*కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జనార్దనరావు కు మద్దతుగా సీనియర్ నాయకులు లీలాప్రసాద్ ప్రజాప్రతినిధుల విస్తృత ప్రచారం*
*గ్రామంలో ఊపందుకున్న ప్రచారం*
*మైలవరం,నవంబర్:- పున్నమి న్యూస్
_చంద్రాల గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బడుగు జనార్దనరావు తెలిపారు._
_గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందించాలనే సంకల్పంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు._
_ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు రాయల లీలాప్రసాద్, ఎంపీటిసి జొన్నలగడ్డ సాంబాశివరావు తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు._ _ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుసుకుంటూ అభ్యర్థి తరఫున తమ అభిప్రాయాలను వివరించారు._
_ఈ సందర్భంగా జనార్దనరావు మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను పరిశీలించి ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని కోరారు._ _గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారుల అభివృద్ధి వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు._
_గతంలో తాను ఎంపీటిసిగా గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ…పదవుల కోసం కాదు.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను._
_గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తా. ప్రజల ఆశీర్వాదంతో సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నా అని బడుగు జనార్దనరావు పేర్కొన్నారు._
_ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు._
_ఎన్నికల ప్రచారంలో గ్రామ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చిస్తూ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కొనసాగించారు._
_ఈ నెల 26న జరిగే పోలింగులో మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు._

