సామాజిక సమానత్వం, విద్య, స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే!
మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశ తొలి సామాజిక సంస్కరణవాదుల్లో ప్రముఖులు. విద్య ద్వారానే వ్యక్తి వికాసం, సమాజ అభ్యున్నతి సాధ్యమని విశ్వసించి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేసిన నవయుగ వైతాళికుడు.
సత్యశోధక సమాజాన్ని స్థాపించి, కుల వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక దురాచారాల నిర్మూలనకు అహర్నిశలు శ్రమించారు. అన్ని కులాలు, మతాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించాలనే ఆశయంతో సాగిన ఆయన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకం.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా, సమాజ మార్పు కోసం ఆయన చేసిన అమూల్య సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.

