Mym, ఐటమ్:-1
ఫోటో:-1(విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థి నివృత్ రావు)
మైలవరం సర్పంచ్‌గా నివృత్ రావు ఘన విజయం
4598 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థిపై గెలుపు
13 వార్డుల్లో 11 కూటమి ఖాతాలోకి.. రెండు వైసీపీకి
మైలవరం,నవంబర్:- పున్నమి న్యూస్ ప్రతినిధి
మైలవరం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎస్.వి.ఎన్. నివృత్ రావు ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి వైసీపీ బలపరిచిన ఓర్సు హేమలతపై ఏకంగా 4,598 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
గురువారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 20 వార్డులకు గాను ఏడు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 13 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 11 వార్డులను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా, 8, 20వ వార్డుల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
సర్పంచ్‌గా నివృత్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

