Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం గూగుల మోడీ సత్యనారాయణ రెడ్డి వర్ధంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం గూగుల మోడీ సత్యనారాయణ రెడ్డి వర్ధంతి

మైలవరంలో గోగులమూడి సత్యనారాయణ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి.

ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 14/11/2026.

మైలవరం గ్రామ ప్రముఖులు, రైతు గోగులమూడి సత్యనారాయణ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం శనివారం మైలవరంలోని ఆయన స్వగృహంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోగులమూడి సత్యనారాయణ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

మైలవరం గూగుల మోడీ సత్యనారాయణ రెడ్డి వర్ధంతి

మైలవరం గూగుల మోడీ సత్యనారాయణ రెడ్డి వర్ధంతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *